calender_icon.png 8 February, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు దహనం

08-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి- 7: కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్  కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు ప్రజలకు వ్యతిరేకంగా, సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా  బడ్జెట్ ఉందని సిఐటియు జిల్లా   అధ్యక్షులు ఆర్. మహిపాల్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్ లు ఆరోపించారు. సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బిజెపి మతోన్మాద ఆర్థిక దివాలకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దేశంలో సంపద సృష్టించే కార్మికులు, కర్షకులు పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.

ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. 

ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ   జిల్లా కార్యదర్శి సతీష్, సిఐటియు, రైతు సంఘం ల నాయకులు లక్ష్మి, అలవేలు, రవీంద్ర, రాజు రమేష్, కుమార్ లక్ష్మీ కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు