న్యూఢిల్లీ,(విజయక్రాంతి): స్కూల్ విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5-8వ తరగతలలో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖకు చెందిన ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సెక్రటరీ సంజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించింది. ఇకపై 5-8 తరగతుల విద్యార్థులు విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే పై తరగతులకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఫెయిల్ అయిన వారు 2 నెలల్లో పాస్ అయితే పైతరగతికి వెళ్లే అవకాశం. ఇంతకు ముందు ఇలా లేదు. 5-8వ తరగతి విద్యార్థులు పాసైన, ఫెయిలైనా పై తరగతులకు వెళ్లే అవకాశం ఉండేది.