calender_icon.png 7 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు కేంద్రం నిధులు

07-02-2025 01:33:35 AM

  1. రవాణా శాఖ నిబంధనల మేరకు 3 మైల్ స్టోన్స్ 
  2. రూ.176 కోట్ల ఇన్సెంటివ్ పొందిన తెలంగాణ
  3. 100 శాతం వాహన పన్ను వసూళ్లు, 
  4. ప్రభుత్వ, ప్రైవేట్ వెహికిల్ స్క్రాపింగ్‌లో అత్యుత్తమ పనితీరు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ రవాణా శాఖ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది. దీంతో కేంద్ర రవాణా శాఖ రాష్ట్ర రవా ణా శాఖకు నజరానా అందించింది. రాష్ట్రంలో వంద శాతం ఆర్టీఏ ట్యాక్స్ వసూలుతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల స్క్రాపింగ్ లక్ష్యాన్ని సైతం చేరుకోవడంతో పాటు ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్ ప్రణాళికను సైతం సిద్ధం చేసినందుకు కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు అందజే సింది.

కేంద్రం నిర్ధేశించిన 3 ఇనీషియేటివ్స్, మైల్‌స్టోన్స్‌లో తెలంగాణ ఉత్తమ పనితీరు చూపి కేంద్రం నుంచి నిధులు రాబట్టింది. తన అత్యుత్తమ పని తీరుతో మొత్తంగా తెలంగాణ రవాణా శాఖ రూ.176.5 కోట్ల నజరానా సాధించింది.

ఇనీషియేటివ్ ఏ మైల్ స్టోన్ 1

ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయి తీ ప్రకటించడంతో పాటు విజయవంతంగా అమలు చేస్తున్నందుకు మైల్ స్టోన్ 1 సాధించినట్టుగా ప్రకటించిన కేంద్ర రవాణా శాఖ, అందుకు అనుగుణంగా రూ.50 కోట్ల నిధులను తెలంగాణకు కేటాయించింది. 

 మైల్‌స్టోన్ 2 

1,000 ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్ కోసం ప్రత్యేకంగా ప్రణాళికను విడుదల చేయడం, 2114 ప్రభుత్వ వాహనాలను స్క్రాపింగ్ చేసినందుకు, 2,005 కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ చేసినందుకు (95 శాతం టార్గెట్ పూర్తి) కేంద్రం రూ.75 కోట్లు విడుదల చేసింది. మైల్‌స్టోన్ 2 ద్వారా 1.5 రెట్లు ప్రయోజనం చేకూరింది.

ఇనీషియేటివ్ బీ మైల్ స్టోన్ 1 

21 ప్రాధాన్య కేంద్రాలు, 16 ప్రాధాన్యత లేని కేంద్రాల్లో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల (ఏటీఎస్) ఏర్పాటుకు తెలంగాణ రవాణాశాఖ సిద్ధమైన నేపథ్యంలో వాటి ఏర్పాటుకు గానూ కేంద్రం రూ.51.5 కోట్లు కేటాయించింది. 

రవాణా శాఖ పనితీరు వల్లే నిధులు..

తాము నిర్ధేశించిన నిబంధనల మేరకు తె లంగాణ రవాణాశాఖ పనిచేస్తున్న నేపథ్యం లో కేంద్రప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వి డుదలచేసింది. ఈ నిధులు తెలంగాణ రవా ణా శాఖ బలోపేతానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఏటీఎస్ ఏర్పాటు, కాలం చెల్లి న వాహనాలను తొలగించి వాహన కాలుష్యాన్ని, ప్రమాదాలను తగ్గించేందుకు అవ కాశం ఏర్పడింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీ వల్ల పెద్దఎత్తున వీటి కొనుగోలు పెరిగి వాహనాల కాలుష్యం భా రీగా తగ్గే వీలుంది. తెలంగాణ ప్రభుత్వం తీ సుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

ఏటీఎస్ ఏర్పాటుతో.. 

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల (ఏటీఎస్) వల్ల వాహనాల కండీషన్‌ను తెలుసుకునే వీలు ఏర్పడుతుంది. బ్రేకులు, లైట్లు, కాలుష్య విడుదల స్థాయి, వాహన ఫిట్‌నెస్‌ను పరీక్షించి వాటిని నడిపేందుకు అనుగుణంగా ఉంటేనే అనుమతిస్తారు. మ్యానువల్ టెస్టిం గ్ కంటే ఏటీఎస్ ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. తద్వారా ప్రమాదాలు తగ్గడంతో పాటు వాహన కాలుష్యాన్ని నియంత్రించే వీలుంటుంది. వాహనాల నిర్వహణకు అవకాశం ఏర్పడి వాటి జీవితకా లాన్ని పెంచే అవకాశం లభిస్తుంది.