calender_icon.png 3 February, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకే కేంద్ర బడ్జెట్

03-02-2025 01:55:18 PM

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న రాష్ట్రానికి తెచ్చిన నిధులు మాత్రం గుండుసున్నా అని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఎద్దవ చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో సోమవారం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబెడ్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని ఆరోపించారు. కేవలం కార్పోరేట్లు ,బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని ఆ న్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి 4 గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఇచ్చినా, ఇక్కడి ప్రజలకు మోదీ మొండి చేయి చూపరన్నారు.