calender_icon.png 3 February, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్ సంపన్నులకు ఊరట

03-02-2025 06:46:55 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల బడ్జెట్ గా ఉందని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట కేంద్ర బడ్జెట్ కాపీలతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయరంగం పారిశ్రామిక రంగాన్ని గిరిజన అభివృద్ధిని దళిత అభివృద్ధిని విస్మరించారని వారికి కేటాయింపులు తక్కువగా చూపించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసియోద్దీన్, శంభు, సురేష్, నవీన్, నూతన్ కుమార్ తదితరులు ఉన్నారు.