calender_icon.png 5 February, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్

05-02-2025 01:38:07 AM

రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు

సంగారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్పొరేట్ సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిందని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ లో నిర్ణయం తీసుకోలేదని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే ఉంద న్నారు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం అన్నారు.

పేదలు కార్మికుల కోసం బడ్జెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దీంతో వారికి ఎలాంటి మేలు జరగదు అన్నారు. దేశంలో కార్పొరేట్ సమస్యలు ఇప్పటికే కార్మికుల శ్రమ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అందులో పెట్టుబడి దారులకు అనుకూల నిర్ణయాలు ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.సంగారెడ్డిలో నిర్వహించిన రాష్ట్ర మహాసభను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి జయరాజ్, మాణిక్యం, మల్లేశం, అడివయ్య, రాజయ్య పాల్గొన్నారు.