calender_icon.png 7 November, 2024 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం

07-11-2024 01:29:30 AM

  1. హామీ లేకుండా రూ.7.50లక్షల రుణం
  2. ప్రతిభగల పేద విద్యార్థులకు ప్రయోజనం

  3. న్యూఢిల్లీ, నవంబర్ 6: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం విద్యాలక్ష్మి పథకానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ నూతన పథకం ఉపయోగపడుతుంది.

  4. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 860 విద్యా సంస్థ ల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజుతో సహా ఇతర ఖర్చుల కోసం రూ.7.50లక్షల వరకు ఎటువంటి హామీ లే కుండా బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుం చి రుణంగా పొందొచ్చు. ఇందులో 75శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారెం టీ ఇవ్వనుంది.

  5. ఇందుకు సంబంధించిన ప్రక్రియంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగు తుంది. అయితే  రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ను పొందుతున్నట్లుతై ఈ పథకం ద్వారా ప్రయోజం పొందలేరు.

  6. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించనుంది. ఎఫ్‌సీఐలో మూలధన అవసరాలకు రూ.10,700 కోట్లను కేటాయించేందుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. జాతీయ విద్యా విధానం -2020 కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా ఏటా దేశ వ్యాప్తంగా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు.