calender_icon.png 20 March, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

20-03-2025 01:36:03 AM

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వలన వ్యవసాయ రంగం దెబ్బతిని సంక్షోభంలో ఉందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు ఆరోపించారు. బుధవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం ముంతాజ్ ఫంక్షన్ హాల్ లో రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి, భాగం హేమంతరావు,సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొ రేట్ శక్తులు అనుకూలంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి దొడ్డి దారిన అమలు చేయడా నికి ప్రయత్నం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం దెబ్బతింటే అన్ని రంగాలు మీద నష్టాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు గమనించి స్వామినాధన్ సిఫార్సులు తక్షణమే అమలు చేసి రైతాంగ వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు.

వ్యవసాయ రంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు బాగా ఉంటాయని తెలిపారు. పంటలు మద్దతు గ్యారెంటీ చట్టం అమలు చేస్తే తప్ప వ్యవసాయంలో రైతు నిలబడగలుగుతాడని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా శక్తివంతమైన ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, నారాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, భూక్యా దసురు, కుమారి హనుమంతరావు, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్  తదితరులు పాల్గొన్నారు.