న్యూఢిల్లీ, నవంబర్ 12: యాపిల్ కంపెనీకి చెందిన డివైజ్‌లు వాడుతున్నవారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలున్నట్లు గుర్తిచింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆయా డివైజ్‌లు వాడుతున్న వారికి హైరిస్క్ పొంచి ఉన్నట్లు పేర్కొంది. పాత సాఫ్ట్‌వేర్‌లో లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు యాపిల్ డివైజుల్లోని డాటాను యాకె ్సస్ చేయడం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఐవోఎస్ 18.1 కంటే ముందు వెర్షన్ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్ పాత మ్యాక్‌ఓఎస్ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్ ఓఎస్ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్ కలిగిన యాపిల్ వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని ఆయా యూజర్లకు తెలిపింది.