calender_icon.png 30 March, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి వెళ్లిన విమానం

27-03-2025 09:31:53 AM

తిరుమల: కేంద్ర విమానయాన శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. విమానం మరోసారి శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి రాకపోకలు నిషేధించబడ్డాయి. విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్రానికి టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోకుండా లైట్ తీసుకుంది. విమానం ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే వెళ్లింది. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపం నుంచే విమానం వెళ్లడంతో విమానయాన శాఖ వైఖరిపై తిరుమల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.