ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఇంటర్ వార్షిక పరీక్ష కేంద్రా లుగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలను ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్ తెలిపారు. బుధవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు సెక్రటరీ, సీఎంవోలో ఓ అధికారి కాలేజీలను ఇబ్బంది పెడుతున్నా రని ఆరోపించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులు, కాలేజీలకు ఫైన్ వేయడాన్ని ప్రైవేటు కాలేజీల సంఘం తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు.