calender_icon.png 4 March, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ భారతంపై కేంద్రం వివక్ష

04-03-2025 12:18:16 AM

-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

బూర్గంపాడు/అశ్వాపురం, మార్చి 3 (విజయక్రాంతి) ః దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామం వద్ద గోదావరిపై ఉన్న ఆనకట్టను, బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన  సందర్శించారు.

అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యాఖ్యానించారు. రైల్వే, నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై నిలవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా,రాష్ర్ట ప్రయోజనాలను కాపాడేందుకు వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా విడుదల చేసిన నీరు సోమవారం సాయంత్రం నాటికి వైరా రిజర్వాయర్‌ను చేరుకుంటుందని మంత్రి తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం,మణుగూరు, పినపాక, బూర్గంపాడు మండలాలకు మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందుబాటులోకి వస్తుందని అన్నారు.

అనంతరం బాహుబలి మోటార్ ద్వారా విడుదల అవుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రాజెక్ట్ పనితీరును ఆయన సమీక్షించారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారా ఆదినారాయణ, అశ్వాపురం, మణుగూరు,బూర్గంపాడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఓుంగంటి బిక్షమయ్య, పిరినాకి నవీన్,దుగ్గెంపూడి కృష్ణారెడ్డి,సీతారామ ప్రాజెక్టు ఎస్ ఈ, డి ఇ ఇతర ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీతారామ ద్వారా వందల చెరువులకు నీరందిస్తాం ః మంత్రి తుమ్మల

ములకలపల్లి, మార్చి 3 ః సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన చెరువులు, ప్రాజెక్టులకు నీరు అందిస్తామని రాష్ర్ట వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలంలో గల కమలాపురం, ఒడ్డు రామారాం పంపుహౌస్ లను ఆయన పరివేక్షించారు.

అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీరు నిత్యం పాడుతుందని, ఆ నేటిని సద్వినియోగం చేసుకొని సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భూములన్నీ షశశ్యామలం చేయాలన్నదే తన చిరకాల కోరిక అని తెలిపారు. జిల్లాలో చెరువులకు నిరంధించేందుకు భూసేకరణ ప్రక్రియ వేగవందం చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలని నేటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

మండలంలో నీరు పుష్కలంగా ఉందని పామ్ ఆయిల్ సాగుకు నేల అనుకూలంగా ఉంటుందన్నారు. 100 కిలోమీటర్ల రాజు లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ కు నీరందిస్తామన్నారు. కృష్ణా జలాలకు ఇబ్బంది కలిగినప్పుడు సాగరకు నీళ్లు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణలకు నీళ్లు నిధులు పంపిణీ విషయంలో కేంద్రం తీరు మార్చుకొని తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి పాల్గొన్నారు.