calender_icon.png 12 October, 2024 | 3:52 AM

2.17 కోట్ల సిమ్ కార్డుల రద్దు దిశగా కేంద్రం!

01-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యం లో కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సమర్పించి పొందిన, సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్నసిమ్‌కార్డుల రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ చర్యలు అమల్లోకి వస్తే 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు కానున్నాయి. అలాగే 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలి కాం శాఖ సమర్పించినట్లు సమాచారం. ఆ సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, ఆర్‌బీఐ, జాతీయ దర్యా ప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఐటీ శాఖ, సీబీఐకు చెందిన అధికారులు, ఇతర భద్ర తా ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సిమ్ కార్డులు జారీ చేసేప్పుడు నో యువర్ కస్టమర్(కేవైసీ)ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.