25-04-2025 12:31:58 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని తీ వ్రంగా ఖండించిన భారత్ బదులు తీర్చుకు నే పనిలో పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్రం సమ న్లు జారీ చేసింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అ హ్మద్ వరైచ్‌కు బుధవారం అర్థరాత్రి తర్వాత సమన్లు పంపింది.
సాద్ అహ్మద్‌ను పిలిపించిన కేంద్రం పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా (అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనడం) అధికారిక నోటీసును అ ందించింది. దీని ప్రకారం వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుందని భారత విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.