ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జన జీవనాన్ని ఒక కుదుపు కుదిపేశాయి. చాలా చోట్ల ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల్లు, సర్వస్వం వదిలిపెట్టుకుని కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఈ వరదల నష్టాన్ని రెండు రాష్ట్రప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించాలి. కేంద్రం కూడా సహృదయంతో ఉదారంగా ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వాలో అంత యుద్ధప్రాతిపదికన అందించాలి.
స్తంభించిన ప్రజా జీవితాలను వెంటనే పునరుద్ధరించాలి. నష్టపోయిన కుటుంబాలను సత్వరం ఆదుకోవాలి. మరణించిన కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ఉదారంగా ఇవ్వాలి. అలాగే భవిష్యత్తులో ఇఆంటి విప్తు సంభవిస్తే నష్టం వాటిల్లకుండా కూడా ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలి. రెండు రష్టారలు కూడా వీలయింత త్వరగా కోలుకోవడానికి కేంద్రం వీలయినంత తోడ్పాటునందించాలి.
స్నేహిత సాగర్, గద్వాల