calender_icon.png 11 October, 2024 | 7:00 AM

కేంద్రం తక్షణ సాయం అందించాలి

04-09-2024 12:19:06 AM

రాష్ట్రంలో జల విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో జల విలయాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, రాష్ట్ర ముదిరాజ్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్,  హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, శశాంకతో కలిసి గండిపేట, హిమాయత్‌సాగర్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. గతంలో కొండగట్టు వద్ద ప్రమాదం జరిగి 69 మంది ప్రాణాలు కోల్పోతే పరామర్శించని నేతలు..నేడు జల విలయంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. భారీ వర్షాల కారణంగా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామన్నారు.ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాములు, జలమండలి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.