calender_icon.png 5 November, 2024 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి తుమ్మల రాసిన లేఖపై స్పందించిన కేంద్రం

05-11-2024 04:25:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రైవేటు భాగస్వామ్యంతో సహజ, సేంద్రియ వ్యవసాయం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కేంద్రం సుముఖం తెలిపింది. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్ర ప్రభుత్వ కృషిని కేంద్రమంత్రి చౌహన్ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును పెంపోందించేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. కాగా, మంగళవారం మంత్రి తుమ్మల తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదమ్ కుమార్ పాల్గొన్నారు. నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. పత్తి తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.