calender_icon.png 22 February, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటీటీలకు కేంద్రం కఠిన ఆదేశాలు

21-02-2025 01:19:29 AM

  1. నైతిక విలువలు తప్పనిసరి
  2. చిన్నారులను ‘ఏ’ రేటెడ్‌కు దూరంగా ఉంచండి
  3. నోటిఫికేషన్ విడుదల చేసిన ఐ అండ్ బీ శాఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, సోషల్ మీడియా కంటెంట్ విషయంలో కఠిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనం టూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీల్లో మితిమీరిన అశ్లీల వీడియోలను ప్రసారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. ఫిర్యాదుల వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ మేరకు గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఓటీటీలు, సోషల్ మీ డియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మధ్య అసభ్యకర సన్నివేశాలు, అభ్యంతకర వ్యాఖ్యలు, అశ్లీల సన్నివేశాలు, ‘ఏ’ రేటెడ్ కంటెంట్ చాలా ఎక్కువైపోయిందని తెలిపింది. ఇకపై ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నైతిక విలువలు కచ్చితంగా పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది.

ముఖ్యం గా ‘ఏ’ రేటెడ్‌కు సంబంధించిన కంటెంట్‌ను చిన్నారులకు అందుబాటులో ఉంచొద్దని వెల్లడించింది. ఐటీ రూల్స్‌లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను తప్పనిసరిగా పాటించాలని.. నిబంధనలు అతిక్రమించి ఎలాంటి కంటెంట్ ను ప్రసారం చేయొద్దు అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇటీవలే ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై పార్లమెంటులోనూ చర్చ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం సైతం తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది.

యూట్యూబ్ సహా ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అభ్యంతరకర కంటెంట్‌పై నియంత్రణ ఉండాల్సిందే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యం లోనే గురువారం కేంద్రం ఓటీటీలకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేసింది.