calender_icon.png 24 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు

24-01-2025 02:01:42 AM

న్యూఢిల్లీ, జనవరి 23: ఉబర్, ఓలా వంటి యాప్‌లు ఓకే దూరానికి ఆండ్రాయిడ్‌లో ఒక చార్జీని, ఆపిల్ ప్లాట్‌ఫామ్‌లో వేరొ క చార్జీని వసూలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో వేర్వేరు చార్జీలు విధించడంపై వివరణ కోరుతూ ఉబర్, ఓలా సంస్థలకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. చార్జిల వసూలు, అందుకు అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో కోరింది.  కాగా ఈ విషయంపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.