calender_icon.png 26 October, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అటవీ చట్టానికి కేంద్రం తూట్లు

10-08-2024 12:30:39 AM

  1. కలిసికట్టుగా హక్కులు కాపాడుకుందాం
  2. గిరిజనుల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  3. బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగావకాశాలు కోల్పోయిన ఎస్టీలు
  4. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయ క్రాంతి): అటవీ హక్కుల చట్టానికి కేంద్రప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) విమర్శించారు. గ్రామ సభల అనుమతు లు లేకుండానే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యధేచ్ఛగా మైనింగ్‌కు అనుమతిచ్చేలా చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. ఆదివాసీ, గిరిజనులంతా ఏకమై అటవీ హక్కులను, అట వీ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాజా బడ్జెట్ లో ఎస్టీల సంక్షేమం కోసం రూ.17 వేల కోట్ల కు పైగా నిధుల కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా గిరిజనులకు కేటాయించి బడ్జెట్‌ను వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీ గూడేలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే సమాజం పురోగమిస్తుందని తెలిపారు. శుక్రవారం ఆదివాసీ భవనంలో రాష్ట్ర ప్రభు త్వం, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడు కలకు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తోపా టు మంత్రి సీతక్క హాజరయ్యారు.

ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో కళాకారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆదివాసీ గిరిజన కళల కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఆదివాసీలు, గిరిజనులు ఎన్నో పోరాటాలు, త్యాగా లు చేసినప్పటికీ ఆ జాతులు అనుకున్న స్థాయి లో అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. తరతరాలుగా కులాలు, జాతుల పేర అనగారిన వర్గాలపై అణచివేత కొనసాగిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఎస్టీల అభ్యున్నతి కోసం అవసరమైన నిధులను కేటాయి స్తామని తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, తాగునీరు వంటి మౌళిక సదుపాయాలను అందించే విధంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 

నిధులు పక్కదారి పట్టించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం

ఐటీడీఏ పరిధిలో అమల్లో ఉన్న జీవో నంబర్ 3ను గత ప్రభుత్వం రద్దు చేయటంతో స్థానిక గిరిజనులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని మంత్రి సీతక్క విమర్శించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా కోర్టు కేసుల్లో అది నలిగిపోతుందని తెలిపారు. బడ్జెట్‌లో గత ప్రభుత్వం వేల కోట్లు కేటాయించి నా నిధులను పక్కదారి పట్టించి ఆదివాసీలకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. గిరిజనులు, ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం  కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 17 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని ఏజెన్సీ, గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పారు. 

కలిసికట్టుగా పోరాటం చేయాలి

అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేలా కేంద్రం వ్యవహరిస్తుందని మంత్రి విమర్శించారు. గ్రామ సభల అనుమతులు లేకుండానే ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో యధేచ్ఛగా మైనింగ్ చేసేలా కేంద్రం చట్ట సవరణ చేయడాన్ని తప్పుబట్టారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్‌కు విచ్చలవిడిగా అనుమతిస్తున్న కేంద్రం, అడవిలోని గ్రామాలకు రోడ్లు వేసేందుకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసుల మూలంగానే అడవులు ఇంకా మిగులుతున్నాయని, ఆ జాతులతో అడవులు ఎప్పటి కీ నాశనం కావని అన్నారు. ఆదివాసుల భాష సంస్కృతులే వారి అస్తిత్వానికి ప్రతికలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, కాంగ్రెస్ ఎమ్మె ల్యే మురళి నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మేడారం సమ్మక్క సారల మ్మ ఆలయ పూజారులు పాల్గొన్నారు.