calender_icon.png 26 November, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్

26-11-2024 12:44:40 AM

సెక్యూరిటీ అప్‌డేట్ చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్, ఐపాడ్, మాక్‌నువాడే వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది. అనుమతులు లేకుండా ఫోన్లలోకి హ్యాకర్లు చొరబడి డాటా చోరీ చేయడంతోపాటు ఆ ఫోన్లు నియంత్రణలోకి తీసుకునే ముప్పు ఉందని తెలిపింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో రెండు రకాల బలహీనతలు గుర్తించాం. వాటిని సైబర్ అటాకర్లు వాడుకుని ఎక్స్‌ఎస్‌ఎస్ దాడులు చేసే అవకాశం ఉంది.

యాపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్‌ఎస్‌లో18.1.1 ముందు వెర్షన్లు, యాపిల్ ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్‌లో17.7.2 ముందు వర్షన్లు, యాపిల్ మ్యాక్ ఓఎస్ సుక్వోయా 15.1.1 ముందు వర్షన్లు, యాపిల్ విజన్ ఓఎస్ 2.1.1 ముందు వర్షన్, యాపిల్ సఫారీ 18.1.1 ముందు వెర్షన్ వాడే వారు అప్రమత్తంగా ఉండాలని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఈ వెర్షన్ల యూజర్లు తమయాపిల్ డివైజ్‌లో సెక్యూరిటీ అప్ డేట్లకు అనుకూలంగా చర్యలు తీసుకోవడంతోపాటు సరికొత్తగా సాఫ్ట్ వేర్ వెర్షన్లు ఇన్ స్టాల్ చేసుకోవాలని తెలిపింది.

ఇటీవలి కాలంలోయాపిల్ ఫోన్లు, ఇతర డివైజ్‌లలోభద్రతపై సెర్ట్-ఇన్ తరుచుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. గత ఏప్రిల్ నెలలోనూ ఇవే హెచ్చరికలు జారీ చేసింది.