26-11-2024 10:28:44 PM
ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ల ప్రయోజనం కోసం బిజెపి ప్రభుత్వం దేశ స్వతంత్రాన్ని స్వలంబనను తాకట్టు పెడుతుందని విమర్శించారు. కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని బిజెపి ప్రభుత్వానికి రానున్న కాలంలో ప్రజలు, కార్మికులు, రైతులు తప్పక బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్, బి.సుధాకర్, నాయకులు మధుసూదన్, తిరుపతి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.