సోషల్ మీడియాలో ఫొటో
షేర్ చేసిన ప్రయాణికుడు
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: భారతీయ రైళ్లలో ప్రయాణిలకు ఐఆర్‌సీటీసీ నాణ్యమైన భోజనం అందడంలో విఫలం అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. తాజాగా ఓ ప్రయాణికుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది. ఆర్యన్ష్ సింగ్ అనే వ్యక్తి ఐఆర్‌సీటీసీ వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో రైతా ఆర్డర్ చేశాడు. సిబ్బంది తెచ్చి ఇచ్చిన రైతాలో అతడికి బతికున్న జెర్రి కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే భారతీయ రైల్వేలలో ప్రయాణికులకు అందించే ఆహారం నాణ్యత మెరుగుపడిందన్న వాదనపై వ్యంగ్యంగా స్పందిస్తూ “అవును, ఇండియన్ రైల్వేలో ఫుడ్ క్వాలిటీ నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు వాళ్లు రైతాకు అదనంగా ప్రొటీన్‌ను జత చేసి మరీ ప్రయాణిలకు అందిస్తున్నారు” అంటూ జెర్రితో కూడిన రైతా ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీఐపీ లాంజ్‌లోనే ఫుడ్ ఇలా ఉంటే సాధారణ రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన అసహనం వ్యక్తం చేశారు