calender_icon.png 21 February, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది!

16-02-2025 12:44:58 AM

  1. ప్రధాని మోదీ కులం గురించి వాస్తవాలు చెబితే హైరానా ఎందుకు?
  2. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనతోపాటు కులగణన చేయాలి
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 1994 జూలై 24వ తేదీన మోదీ కులాన్ని ఓసీ నుంచి ఓబీసీలో చేర్చారని, అందుకే మోదీ కన్వెర్టెడ్ బీసీ అన్నాడని తెలిపారు. ఈవిషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా అంగీకరించారని పేర్కొన్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తయ్యాక చట్టం చేస్తామని స్పష్టం చేశారు.

శనివారం మహేశ్‌కు మార్‌గౌడ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లడుతూ.. 9వ షెడ్యూల్ చట్టసవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలోని బీజేపీ మేలు చేయాలని డిమాం డ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి  వాస్తవాలు మాట్లాడితే బీజేపీ నేతలు ఎందుకు హైరానా పడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ పుట్టు కతోనే బీసీ అని, మోదీ పుట్టుకతో బీసీ కాదనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కష్టపడి పనిచేసినా.. ఎన్నికల నాటికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి  తీసిపడేశారని తెలిపారు.

రాహుల్‌గాంధీ తాత గురిం చి బీజేపీ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతోందని, గాంధీ కుటంబం త్యాగాలను మర్చిపో వద్దని హితవు పలికారు. ఓబీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ పదేళ్లలో బీసీలకు చేసిందేమిలేదన్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏ త్యాగం చేశారని నిలదీశారు. రాహుల్‌గాంధీ కులం అడుగుతున్న బీజేపీ, దేశంలో కులగణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగాలన్నా రు. పింక్‌బుక్ ఓపెన్ చేస్తామని అంటున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ స్కామ్ బయటపడిందని, ఇక పింక్‌బుక్‌లు ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని బయటపడుతాయో తెలియదని ఎద్దేవా చేశారు.