11-02-2025 01:00:39 AM
* సోనియాగాంధీ డిమాండ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ సోమవారం డిమాండ్ చేశారు. జనగణన ఆలస్యమవుతుండడం వల్ల 14 కోట్ల మంది జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిని కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు.
త్వరగా జనగణన చేపట్టడం వల్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద ఎందరో పేద ప్రజలు లబ్ధి పొందుతారన్నారు. ఇప్పటికీ 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్లే ఇలా జరుగుతుందని తెలిపారు.