calender_icon.png 16 October, 2024 | 2:18 PM

2 దశల్లో కులగణన

16-10-2024 03:10:14 AM

మొదటి దశలో హౌస్ లిస్టింగ్, సర్వే ముందస్తు కార్యకలాపాలు

రెండో దశలో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో క్షేత్రస్థాయి గణన

ఒక్కో దశకు మూడు వారాలు నిర్దేశిత సమయం

డేటా ప్రాసెసింగ్ రిపోర్టింగ్‌కు రెండు వారాలు

55 అంశాలపై డిజిటల్ మోడ్‌లో డేటా సేకరణ

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయ క్రాంతి) : తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కులగణన సర్వేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. సర్వేలో భాగంగా చేపట్టే కార్యకలాపాలను నిర్ణయించింది. బీసీ కమిషన్ పర్యవేక్షణలో, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కులగణన చేపట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల ఇళ్లను సర్వే చేసేందుకు కావాల్సిన మానవవనరులు, డేటా సేకరించాల్సిన అంశాలు, నిర్దేశిత సమయం వంటి అంశాలపై తుది ప్రతిపాదనను తయారుచేసింది. 60 రోజుల గడువులో సర్వేను పూర్తిచేయాలని ఇప్పటికే నిర్ణయించింది. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు.

మొదటి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్, సర్వే ముందస్తు కార్యకలాపాలను చేపట్టనున్నారు. ఇందు లో ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ నియామకం, డేటా సేకరణకు కావాల్సిన ప్రశ్నా పత్రం ప్రమాణీకరణ, మాన్యువల్‌ల తయారీ, జిల్లా కలెక్టర్లతో సమావేశాలు, ఎన్యుమరేషన్ బ్లాక్‌ల ఏర్పాటు, మాస్టర్ ట్రైనర్‌లు, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ, అప్లికేషన్ డెవలప్‌మెంట్, ప్రశ్నా పత్రాల ప్రీ వంటివి చేస్తారు. రెండో దశలో క్షేత్రస్థాయిలో వివరణాత్మక గణన చేపడతారు. 

90 వేల ఎన్యుమరేటర్లు.. 12,500 సూపర్‌వైజర్లు

రెండో దశలో చేపట్టే సర్వేను కూడా తిరిగి రెండు దఫాలుగా విభజించారు. మొదటి దఫాలో 10 వేల మంది ఎన్యుమరేటర్లు, 2,500 సూపర్‌వైజర్లతో సర్వే చేపడతారు. ఇందులో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్ 1200 ఇళ్లను సర్వే చేస్తారు. ఒక్కో సూపర్‌వైజర్ నలుగురు ఎన్యుమరేటర్లను సూపర్‌వైజ్ చేస్తారు. రెండో దఫాలో 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది సూపర్‌వైజర్లు సర్వే చేపడతారు. ఈ దఫాలో ఒక్కో ఎన్యుమరేటర్ 150 ఇళ్లను సర్వే చేస్తారు. ఒక్కో సూపర్‌వైజర్ 8 మంది ఎన్యుమరేటర్లను సూపర్‌వైజ్ చేస్తారు. 

హౌస్ లిస్టింగ్‌కు 3 వారాలు

హౌస్ లిస్టింగ్ ఫీల్డ్ వర్క్, డేటా ప్రాసెసిం గ్, ఎన్యుమరేషన్ బ్లాక్ ఏర్పాటు, ఇతర కార్యకలాపాలు సమాంతరం నిర్వహిస్తారు. దీని కోసం మూడు వారాల సమయాన్ని నిర్దేశించారు. ఈ ప్రక్రియలో ప్రతి ఎన్యుమరేటర్ రోజుకు 80 కుటుంబాల చొప్పున 15 రోజులపాటు సర్వే చేస్తారు. మిగిలిన ఏడు రోజుల పాటు తప్పిపోయిన ఇళ్లలో సర్వే చేయడం, డేటా సేకరణ ప్రశ్నాపత్రాలపై ఇంటి యజమానితో సంతకాలు చేయించడం, దానికి సంబంధించిన ప్రింట్‌ను వారికి ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడతారు. 

క్షేత్రస్థాయి గణనకు మూడు వారాలు

క్షేత్రస్థాయి వివరణాత్మక గణన కూడా మూడు వారాల సమయాన్ని నిర్దేశించారు. ఇందులో భాగంగా ప్రతి ఎన్యుమరేటర్ రో జుకు 10 కుటుంబాల చొప్పున 15 రోజులపాటు సర్వే నిర్వహిస్తారు. మిగిలిన ఏడు రోజుల పాటు తప్పిపోయిన ఇళ్లలో సర్వే చే యడం, డేటా సేకరణ ప్రశ్నాపత్రాలపై ఇంటి యజమానితో సంతకాలు చేయించడం, దా నికి సంబంధించిన ప్రింట్‌ను వారికి ఇవ్వ డం వంటి కార్యక్రమాలు చేపడతారు. తర్వా త రెండు వారాల్లో నమూనా తనిఖీ సర్వేలు, డేటా ప్రాసెసింగ్, రిపోర్టింగ్ వంటి సర్వే తర్వాత కార్యకలాపాలు నిర్వహిస్తారు. మొత్తం ఎనిమిది వారాల నిర్దేశిత సమయంలో పూర్తిస్థాయి సమగ్రమైన కులగణనను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. 

ఇతర రాష్ట్రాల్లో..

కులగణన చేపట్టిన ఇతర రాష్ట్రాలతో పో లిస్తే తెలంగాణలో సమగ్రమైన సర్వేను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో 1.35 కోట్ల ఇళ్లు  ఉండగా.. సర్వే చేపట్టేందుకు 1,33,000 మంది ఎన్యుమరేటర్లు, 22,190 మంది సూపర్‌వైజర్లు పనిచేశారు. సర్వేలో 54 అంశాలపై డేటా సేకరించారు. బీహార్ లో 2.77 కోట్ల ఇళ్లు ఉండగా, సర్వే కోసం 2,34,667 మంది ఎన్యుమరేటర్లు, 40,726 మంది సూపర్‌వైజర్లు పనిచేశారు. సర్వేలో 17 అంశాలపై మాత్రమే డేటా సేకరించారు.

ఇక ఏపీలో 1.67 కోట్ల ఇళ్లు ఉండగా, సర్వే చేపట్టేందుకు గ్రామ వలంటీర్, సెక్రటరీ వ్య వస్థనంతటినీ వాడుకున్నారు. సర్వేలో 31 అంశాలపైనే డేటా సేకరించారు. ఈ రాష్ట్రాల తో పోలిస్తే తెలంగాణలోనే అత్యధికంగా 55 అంశాలపై డేటా సేకరించనున్నారు. దీనికోసం మొత్తం 90 వేల మంది ఎన్యుమరేట ర్లు, 12,500 మంది సూపర్‌వైజర్లను వినియోగించుకోనున్నారు. దీంతోపాటు కర్ణాట కలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో,  బీహార్‌లో జీఏడీ ఆధ్వర్యంలో, ఏపీలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో కులగణన సర్వే నిర్వహించారు. 

55 అంశాలపై డేటా సేకరణ

సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల ఇళ్లకు, కుటుంబసభ్యులకు సంబంధించి 55 అంశాలపై డేటా సేకరించనున్నారు. ఈ ప్రక్రియనంతటి ని డిజిటల్ పద్ధతిలో సేకరిస్తారు. వీటి లో కుటుంబ యజమాని, సభ్యుల వ్య క్తిగత, సాధారణ వివరాలు, విద్యా  వివరాలు, ఉపాధి, రాజకీయ ప్రా తినిథ్య వివరాలు, ఆర్థిక(ఆస్తుల) వివరాలు సేకరిస్తారు. ఈ విధంగా సేకరిం చిన వివరాల పత్రాన్ని కుటుంబానికి ఒక ప్రింటవుట్ ఇస్తారు. కుటుంబ య జమాని సంతకం చేసిన పత్రాన్ని ఆయా మండల కేంద్రాల్లో భద్రపరుస్తారు.