calender_icon.png 20 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వసతులతో శ్మశానవాటికలు

20-03-2025 01:15:45 AM

  1. ఖమ్మం సత్తుపల్లిలో మాడల్ వైకుంఠధామాలు 
  2.   సూర్యాపేట, నల్గొండను మాడల్‌గా తీసుకోవాలి
  3.  జిల్లా కలెక్టర్, కమిషనర్లకు మంత్రి తుమ్మల ఆదేశం

ఖమ్మం, మార్చి 19( విజయక్రాంతి ):మనిషి మరణించిన తర్వాత చివరి మజిలీ మహా ‘ప్రస్థానం‘ మహా అద్భుతంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు అధికారుల ఆదేశించారు. బుధవారం హైదరాబాదులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలపై సమక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం సత్తుపల్లిల్లో మోడల్ వైకుంఠ దామాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అగస్త్య, సత్తుపల్లి కమిషనర్ నరసింహ ను ఆదేశించారు. ఖమ్మం ఖమ్మం సత్తుపల్లి కేంద్రాలలో వైకుంఠధామాలను అద్భుతంగా నిర్మాణం చేసి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలపాల న్నారు.

ఈ మేరకు కన్సల్టెన్సీ కంపెనీ ప్రతినిధులు మోడల్ వైకుంఠధామాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటిని పరిశీలించిన మంత్రి తుమ్మల సూర్యపేట నల్గొండలో వైకుంఠధామాలను మోడల్గా తీసుకొని ఆ ప్రకారం నిర్మాణం చేపట్టాలని సూచించారు. వైకుంఠధామాలలో ఇలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చదనం పరిశుభ్రత ఉట్టిపడేలా అత్యాధునిక హంగులతో భూలోక స్వర్గాలను తలపించేలా నిర్మాణం చేపట్టాలన్నారు. అందంగా రూపుదిద్దాలని మంత్రి తుమ్మల కన్సల్టెన్సీలను ఆదేశించారు.