11-12-2024 02:20:49 AM
శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : సైబరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్లను రికవరీ చేసిన సీసీఎస్ పోలీసులు వాటిని మంగళవారం బాధితుల కు అందజేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నర్సింహ మాట్లాడు తూ.. 45 రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 1,100 సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. గత 11 నెలల్లో మొత్తం 5,500 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.3కోట్ల 30లక్షలు ఉంటుందన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.