calender_icon.png 28 December, 2024 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాస్ రూంలోకి సెల్‌ఫోన్లు బ్యాన్!

28-12-2024 03:28:33 AM

  1. ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలుకు యోచన
  2. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో ‘నో సెల్‌ఫోన్ పాలసీ’ అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తున్నది. తరగతి గదుల్లో మొబైల్ వినియో గాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.

విద్యార్థులు పాఠాలు వినే సమయంలో సెల్ ఫోన్లు, ట్యాబ్స్, స్మార్ట్ వాచ్ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయని మండలి ప్రాథమికంగా గుర్తించింది. దీంతో విద్యార్థులు క్లాస్‌రూంలో వాటి జోలికి వెళ్లకూడదని, చక్కగా చదువుకోవాలనే ఉద్దేశం తోనే కొత్త పాలసీ తీసుకురానున్నట్లు తెలుస్తున్నది.

దీనిలో భాగంగానే అన్ని యూనివర్సిటీ, కాలేజీల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత మండలి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని సమాచారం. అంతేకాదు.. ఈ నిబంధన విద్యార్థులకే కాకుండా, అధ్యాపకుల సైతం వర్తింపజేస్తే ఎలా ఉంటుందనే అంశాన్నీ ఉన్నత విద్యా మండలి పరిశీలిస్తున్నది.

విద్యాసంస్థలో ప్రవేశించగానే విద్యార్థులు, అధ్యాపకులు మొబైల్స్ భద్రపరచుకునేలా యాజమాన్యాలు ప్రత్యేక వసతి కల్పించాలనే సూచించనున్నట్లు తెలిసింది. బ్రేక్ టైంలో లేదా క్లాసులు పూర్తయిన తర్వాత తిరిగి మొబైల్స్ తీసుకునే వెసులుబాటు ఉండేలా విధివిధానాలు అమలులోకి రానున్నాయి.