25-02-2025 02:26:41 AM
వన్యప్రాణుల బోర్డు సమావేశంలో మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఆయా అటవీ ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన నాలుగు మొబైల్ టవర్లు, ఇతర ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొం డా సురేఖ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు 8వ సమావేశం జరిగింది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మా ణం కోసం సవరించిన ప్రతిపాదనలపై మీటింగ్‌లో చర్చించారు. బీఎస్ ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేసే అంశం పై చర్చ జరిగింది. అటవీ ప్రాంతాల నుంచి గిరిజనుల తరలింపు ఎలా చేస్తున్నారో అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తే.. 1/70 చట్టం కింద కలిగే ప్రయోజిత ప్రాంతాలకు తరలిస్తున్నారా అని ఆమె నిలదీశారు.
సంబంధిత చట్టం ప్రయోజిత ప్రాం తంలోకే తరలిస్తున్నట్టు అధికారుల వివరణ ఇచ్చారు. రాత్రిపూట భారీ వాహనాలకు అటవీ రోడ్ల నుంచి అనుమతి ఇవ్వొద్దని మంత్రి సూచించారు. నియమ నిబంధనలను అధ్య యనం చేసి, వాహనాల రాకపోకల సమయపాలనపై అవసరసరమైతే నిబంధనలు సవరించాలని మంత్రి సలహా ఇచ్చారు.