calender_icon.png 31 October, 2024 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్‌ఫోన్ దొంగల అరెస్టు

30-07-2024 02:20:51 AM

30 ఫోన్లు, నాలుగు బైక్‌లు స్వాధీనం

ఎల్బీనగర్, జూలై 29: సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను సోమవారం వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంగూడ పరిధిలో నివాసం ఉండే పెయింటర్ అమ్మూరి కన్నయ్య, డ్రైవర్ గారడి వంశీ, ఘట్‌కేసర్‌లో ఉండే రోజు కూలీ అంబటి సత్యనారాయణ, బడంగ్‌పేట పరిధిలో నివాసం ఉండే పెయింటర్ చంద్రమోహన్, డ్రైవర్ బండి జస్వా ఒక ముఠాగా ఏర్పడి రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న వారిని అడ్డుకొని సెల్‌ఫోన్లు, నగదు చోరీ చేస్తున్నారు. ఈ నెల 15న వనస్థలిపురం డివిజన్‌కు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తనను కొందరు అడ్డు కొని సెల్‌ఫోన్ అపహరించారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా దొంగల ముఠా పట్టుపడింది. నింది తులను అరెస్టు చేసి 30 ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.