హైదరాబాద్,(విజయక్రాంతి): సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ల చోరీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వద్ద బస్సులో ప్రయాణికుల వద్ద దొంగలు సెల్‌ఫోన్ కొట్టేశారు. చోరీ అనంతరం తప్పించుకునే ప్రయత్నం చేసిన ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు ముఠాను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సింది.