calender_icon.png 23 April, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాక్ పల్లి లో మహాదేవుని దర్శించుకున్న ప్రముఖులు

09-04-2025 05:54:50 PM

నాగల్ గిద్ద: సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం ఇరక్ పల్లి గ్రామంలోని మహాదేవుని ఆలయానికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌతమ్ సిద్దు అనిత దంపతులు ఇరక్ పల్లి గుంపా దేవిదాస్ మహారాజ్ మాట్లాడుతూ... పండరీపూర్ వార్కారి భక్తులు ఏకాదశి ప్రతిష్టంగా నిర్వహిస్తారు.అని మహాదేవుని ఆలయంలో భారశి ద్వాదశిన ఆ పరమశివుని రోజుగా భావిస్తారని తెలిపారు. అందుకుగాను ద్వాదశి ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశిన ఒకపొద్దు ఉన్న భక్తులకు అన్నదానం నిర్వహించిన గౌతమ్ సిద్దు అనితా దంపతులు, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమానికి యువనేత సాగర్ శేట్కార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్, మండల ఎంపీడీవో మహేశ్వర రావు, గుఱ్ఱపు మచ్చెందర్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ విట్టల్ రావు పాటిల్, పంచాయతీ కార్యదర్శి సురేందర్, సతీష్ పాటిల్, సోపన్ రావు పాటిల్, బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు పండరి, నాగిరెడ్డి, ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.