calender_icon.png 18 March, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి సతీష్ దశ దిన కర్మకు హాజరైన ప్రముఖులు..

17-03-2025 07:01:31 PM

నివాళులర్పించిన సిపిఎం నేతలు పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు..

వైరా (విజయక్రాంతి): సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు, యువజన నాయకులు సంక్రాంతి సతీష్ ఇటీవల అకాల మరణం చెందారు. సోమవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలోని వారి స్వగృహంలో దశ దిన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అమరజీవి కామ్రేడ్ సంక్రాంతి సతీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వీరితో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, మాదినేని రమేష్, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, మండల కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, చెరుకుమల్లి కుటుంబరావు పూలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మధు విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి వీరభద్రరావు, పార్టీ నాయకులు దొడ్డపనేని కృష్ణార్జునరావు, మచ్చా మణి, బొంతు సమత, పారుపల్లి కృష్ణారావు, హరి వేంకటేశ్వరరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, గుమ్మా నరసింహారావు, కామినేని రవి, షేక్ నాగుల్ పాషా, సంక్రాంతి పురుషోత్తమరావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, సంక్రాంతి చంద్రశేఖర్, చింతనిప్పు కృష్ణారావు, యనమద్ది రామకృష్ణ, అమరనేని కృష్ణ, మాడపాటి మల్లికార్జున్, మాడపాటి వెంకటి, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.