27-02-2025 07:15:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో పలువురు నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ, జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు గ్రాడ్యుయేట్ ఓట్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.