21-03-2025 12:48:01 PM
మాదాపూర్ డీసీపీ వినీత్
కేసులో లీగల్ పరిణామాలను సైతం పరిశీలిస్తున్నాం
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో పాన్ ఇండియా స్టార్స్(Pan India Stars) ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను సైతం పరిశీలిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్(Madhapur DCP Vineeth) అన్నారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వినీత్ మాట్లాడుతూ.. మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ సేకరించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యత లేకుండా సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారన్నారు.స్టార్స్ తో యాడ్స్ చేసి ఆయా ప్లాట్ ఫామ్స్ లోబెట్టింగ్ యాప్స్ నిర్వహకులు ప్రమోట్ చేసినట్లు తెలిసిందన్నారు. వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వ్యక్తిగత అకౌంట్లలో ప్రమోట్ చేశారన్నారు.