భైంసా, నవంబర్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయకున్నా ఆ ఆ పార్టీ నాయకులు మాటలతో కాలయాపన చేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ విమర్శించారు. భైంసా మండలం వఠోలి గ్రామంలో మంగళవారం ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. సీసీ రోడ్లు, పాఠశాల మరుగుదొడ్ల పనులను ప్రారంభించారు. అభివృద్ధిని విస్మరించిన సీఎం రేవంత్ ప్రభు త్వం ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు.
గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, అపరిశుభ్రతతో ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నా ప్రభు త్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.