calender_icon.png 7 March, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపుతో సంబురాలు

07-03-2025 01:21:10 AM

భీమదేవరపల్లి మార్చి 6( విజయక్రాంతి) భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా చిన్న మైల్ అంజిరెడ్డి గెలుపుతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో టపాసులు పేల్చి సంబరాలు జరుపు కున్నారు.  నరేందర్ రెడ్డి ఓటమి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత వహించాలని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ఇదేవిధంగా రిపీట్ అవుతుందని తెలిపారు.

మల్కా కొమురయ్య. చిన్నమైల్ అంజిరెడ్డి లను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది. బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ ,మాజీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల రక్తం తాగడమే తప్ప పేద ప్రజలకు ఏమి చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంవిధానాలు నచ్చకనే  ఉపాధ్యాయులు మేధావులు గ్రాడ్యుయేట్స్  ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ విజయాన్ని అందించారు. 

కరీంనగర్ జిల్లాలో స్థానికంగా ఇద్దరు మంత్రులుండి ఒక్క ఎమ్మెల్సీ గెలిపించుకోలేని  మంత్రులు బండి సంజయ్‌ని టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, గండు సారయ్య, మాచర్ల కుమారస్వామి, ఊస కోయిల కిషన్, అంబీర్ కవిత, దొంగల వేణు, బొజ్జపురి పృధ్వీరాజ్,

దొంగల రాణా ప్రతాప్, కంకల సదానందం, లక్కిరెడ్డి మల్లారెడ్డి,అయిత సాయి తేజ, బొల్లంపల్లి శ్యామ్, కాలేరు వికాస్, సింగం రాజేందర్, చొప్పరి నవీన్,గద్ద రాజేందర్, బైక్‌అని అఖిల్, సిద్ధమల్ల రమేష్, వేముల ప్రసాద్, ఆవుల శ్రీనివాస్,మొండెడ్ల  ఉదయ్, తాళ్లపల్లి రవిచంద్, జనగాని కుమారస్వామి, చార్మిత, సంజయ్ తదితరులు పాల్గొన్నారు