మేడ్చల్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబ రాల నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచాలు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.
పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, గోమారం రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గువ్వా రవి ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేగు రవి ముదిరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మాజీ కౌన్సిలర్లు జాకాట దేవరాజ్, కౌడ మహేష్ కురుమ,
పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లవంగు రాకేష్ వంజరి, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు గుండా శ్రీధర్, మాజీ సర్పంచులు సంజీవరావు, కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గం వెంకటేష్ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, నడి కప్పు రంజిత్ ముదిరాజు, కాలేరు శ్రీకాంత్, గర్దాస్ నరేందర్, బండి శ్రీనివాస్ గౌడ్, సద్ది ప్రకాష్ రెడ్డి, విగ్నేశ్వర్ రెడ్డి, భాష ,వెంకటేశ్వర యాదవ్, ఆకుల రాజు మునిగొండ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.