11-03-2025 05:20:11 PM
మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ఉద్యమనేత అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ పార్టీ అదిష్టానం ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో మాల మహానాడు ఆద్వర్యంలో సంబరాలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దయాకర్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు దాసరి రాములు, జిల్లా అధ్యక్షులు గజెల్లి లక్ష్మణ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, నాయకులు కుమారస్వామి, నాగుల దుర్గయ్య, కోడం శ్రీనివాస్, నాగుల నారాయణ, పౌల్, అధికార ప్రతినిధి బండ రవి, దాసరి అనిల్, రంజిత్, పోషం, నర్సయ్య, మద్దెల విజయ్, బన్న శ్రీనివాస్ లు పాల్గొన్నారు.