08-04-2025 10:17:36 PM
భూక్య జాన్సన్ నాయక్..
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ సమాజం గర్వపడేలా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే చలో వరంగల్ కార్యక్రమం జరుపుకుందామని ఖానాపూర్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ కేంద్రంలో చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సమాజం గర్వించేలా మొదటి నుండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ నేనని, కేసీఆర్ పాలన తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలన పరిరక్షణను అందించగలరని, ఈ రజతోత్సవ వేడుకలకు ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, తాళ్లపల్లి రాజ గంగన్న, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, ప్రదీప్, కారింగుల సుమన్, గౌరీకర్ రాజు, నసీర్, లింగన్న, దివాకర్, పలువురు ఉన్నారు.