కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): డిసెంబర్ 1 నుంచి 9వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విజయోత్సవాలు అన్ని శాఖల సమన్వ యంతో నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు శాఖపరంగా కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల విజయ గాథలను తెలిపే విధంగా ప్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత, జడ్పీ సీఈవో చందర్‌నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.