calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సవాలను పండుగలా జరుపుకోవాలి

05-04-2025 12:55:46 AM

  • శివ రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట 

గోపాలపేటలో బోరుబావిని తవ్వించిన ఎమ్మెల్యే 

గోపాలపేట ఏప్రిల్ 4  : గ్రామాల్లో ఉత్సవాలను అంద రూ కలిసి పండుగల జరుపుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. శుక్రవారం గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామంలో శివ రామాలయంలో సీతా రామచంద్ర స్వామి ఆలయ ధ్వజస్తంభ న ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొన్నారు. 

అనంతరం ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పా టు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు భోజనం వడ్డిం చారు. కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్యసిలారెడ్డి. జైపాల్ రెడ్డి నారాయణ యాదవ్ తిరుపతి రెడ్డి వెంకటేశ్వర్లు కొంకి వెంకటేష్ సురేష్, విష్ణు రాజు పాల్గొన్నారు.

గోపాలపేటలో బోరు బావికి పూజలు

గోపాలపేట మండల కేంద్రంలో ని హనుమండ్ల గడ్డ కాలనీలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం పట్ల. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బోరు బాబుని తవ్వించి సొంత డబ్బులతో మోటార్లను బిగించారు.

దీంతో శుక్రవారం ఎమ్మెల్యే మెగా రెడ్డి స్వయంగా బోరుబావి మోటార్ను ఆన్ చేసి ప్రజలకు దాహార్తిని తీర్చారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్య శిలా రెడ్డి, శివన్న తదితరులు పాల్గొన్నారు.