calender_icon.png 19 March, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి సంబరాలు..

18-03-2025 11:04:12 PM

కల్లూరు (విజయక్రాంతి): 30 సంవత్సరాల నుండి పొరాటం చేస్తున్న మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ అయినా సందర్బంగా కల్లూరు మండలంలో ఎమ్మార్పీఎస్ నేతలు అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేసి సంబరాలు చేసారు. పోరాట యోధుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కల్లూరు మండలం ఎమ్మార్పీఎస్  నాయకులు, అనంతరం వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో, శాసన మండలిలో ఆమోదింప చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దామోదర్ రాజనర్సింహకి, తదితర దళిత ప్రజా ప్రతినిధులకు, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు.