calender_icon.png 6 March, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గెలుపుతో సంబరాలు

06-03-2025 07:44:04 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించడంతో ఉపాధ్యాయులు, పట్టభద్రులకు రుణపడి ఉంటామని బిజెపి మండల అధ్యక్షురాలు దేవుడి లావణ్య నర్సింహారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఎన్నికలు ఏవైనా బిజెపి విజయం ఖాయమని అన్నారు.

పేద ప్రజలకు ఏమి చేయలేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రభుత్వ విధివిధానాలు నచ్చకనే ఉపాధ్యాయులు, మేధావులు భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని అసత్య ఆరోపణలు చేసిన తెలంగాణ ప్రజలు బిజెపి వైపే నిలబడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి గౌడ్, రమేష్, గణేష్, మహేష్, స్వామి, కుమార్, స్వామిగౌడ్, నరేష్, స్వామి, శ్రీకాంత్, భాను, కర్ణాకర్, చందు, లక్ష్మణ్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.