25-02-2025 02:32:13 AM
మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం న్యారి న్యాయ్ సమ్మేళనం గాంధీభవన్‌లో నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్ష పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్‌ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సభ్యత్వాలు తెలంగాణలో ఎక్కువ జరిగినట్లు చెప్పారు.
సభ్యత్వ రుసుము ద్వారా వచ్చే మొత్తంతో ప్రతి జిల్లాలో శానిటరీ న్యాప్‌కిన్స్ మిషన్స్‌ను మహిళలకు అందజేసి ఉపాధిని అందించనున్నట్లు చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావుతోపాటు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, బ్లాక్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.