calender_icon.png 20 March, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

20-03-2025 01:05:50 AM

హనుమకొండ, మార్చి19 ( విజయ క్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభు త్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ 42% చట్టబద్ధత కల్పించి తెలంగాణ బీసీ లకు న్యాయం జరిగేలా కృషి చేసినందుకు  ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ పోరాటమైన ఎస్సీ వర్గాలకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన సంద ర్భంగా  హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి  ఆదేశాలనుసారం బుధవారం ఈ హన్మకొండ జిల్లా  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలను నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్ర పటానికి  జిల్లా ఎస్,సి,. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ రామకృష్ణ జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా  బొమ్మతి విక్రం మాట్లాడుతూ పకడ్బందీగా కుల గణన పూర్తి చేసి బీసీ జనాభా లెక్క పక్కాగా తేల్చి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆ కోటాకు చట్టబద్ధత కల్పిస్తూ.

రాష్ట్ర శాసన సభలో బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా ఎస్. సి డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి రామకృష్ణ  మాట్లడుతూ .. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకుగాను  ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కులగనన విషయంలో మదన పడుతున్న సమయంలో బీసీ బిల్లును  ప్రవేశ పెట్టినందుకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు ఎస్సీ వర్గీకరణ లో ప్రత్యక్షమైన చొరవ చూపినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ కి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

గతంలోనూ కడియం శ్రీహరి  ప్రత్యేమైన కీలకపాత్ర పోషించారు అని అన్నారు.అదే తరహాలో ఇప్పుడు కూడా వారు కీలక పాత్ర పోషించి ఎస్సీ వర్గీకరణ అయ్యేంతవరకు అహర్నిశలు శ్రమించినందుకు వారికి ఎస్సీ సామాజిక వర్గం తరఫున ప్రతేఖ్యమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని తెలిపారు.

సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం ఇటు బీసీలకు మరియు ఎస్సీలకు సామాజిక న్యా యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో జరగడం చాలా ఆనందంగా ఉంది గత పదేళ్లుగా బీఆర్ ఎస్ పాలనలో ఎస్సీలు, బీసీలు ఎంతగానో అరి గోసలు పడ్డారు బిఆర్‌ఎస్ అహంకారానికి బలయ్యారని ప్రభుత్వం తరఫున వచ్చే ఫలాలను అందుకోలేకపోయారు ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు.

అప్పుడు జరగని సామాజిక న్యాయం ఇప్పుడు  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎస్సీలకు,బీసీలకు సా మాజిక న్యాయం జరిగిందని ముందు తరాలకు రేవంత్ రెడ్డి  అందించిన గొప్ప వరమ ని రామకృష్ణ  చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఫ్లోర్ లీడర్ కార్పొ రేటర్ తోట వెంకన్న  కార్పొరేట్ పోతుల శ్రీమాన్, బీసీ సెల్ అధ్యక్షులు విక్రం  జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా నాయకులు వల్లాల జగన్ గౌడ్, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షులు రణధీర్, భాస్కర్, వినయ్ కుమార్, ఎర్ర మహేందర్, కిరణ్, మేరీ, సుకన్య, తాళ్ల పెళ్లి సుధాకర్, ఈర మహేందర్,గొర్రె మహేందర్ , జయరాం, సుజాత, సుగుణ, ఝాన్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.