calender_icon.png 8 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదేవపూర్ లో బిజెపి కార్యకర్తల సంబరాలు..

08-02-2025 08:50:39 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): ఢిల్లీలో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఐలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో ప్రజలు బీజేపీని గెలిపించారని, త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో తెలంగాణలోనూ పార్టీ మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల ఉపాధ్యక్షులు హరికృష్ణ, కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి మహేష్ చారి, బాలరాజు, లంబ నాగరాజు, మహిళా మోర్చా నాయకురాలు నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.