calender_icon.png 8 February, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్ లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

08-02-2025 07:43:03 PM

హుస్నాబాద్: ఢిల్లీలో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆపార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల మాట్లాడుతూ... దేశంలో ఏమూలన ఎన్నికలు నిర్వహించినా ప్రజలు బీజేపీని అదరిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాల్ రావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శంకర్ బాబు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరాచారి తదితరులు పాల్గొన్నారు.