06-03-2025 06:18:24 PM
మేడ్చల్ (విజయక్రాంతి): కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచిన సందర్భంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంజిత్ మోహన్, కృష్ణ గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, నాయకులు రవీందర్ గౌడ్, అర్జున్ బాబు, వెంకటేష్, విక్రమ్, నవీన్, నాగరాజు, నవనీత, చెంచాల సురేష్, శ్రీకాంత్, వెంకటేష్, అరుణ్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ లో.....
బిజెపి అభ్యర్థులు గెలుపొందడం పట్ల రాష్ట్ర నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, వంశీధర్ రెడ్డి, రాగం అర్జున్, కృష్ణప్రియ మల్లారెడ్డి, జాకాటా ప్రేమ్ దాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని ఎన్నికల్లోను ఇవే ఫలితాలు వస్తాయన్నారు.